Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రామ లాలిత్యకు ఉత్తమ సేవా నారి పురస్కార అవార్డు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని నాట్యాచార్యులు బాబు బాలాజీ, కమలా బాలాజీ కుమార్తె అయిన రామలిత్యకు కళా రంగంలోనూ దర్శక రంగంలోనూ విశేష సేవలను అందిస్తూ అందరి మన్ననలతో పాటు మంచి అనేక జిల్లాలలో గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సంస్కార భారతి వారు నిర్వహించిన మహిళ దినోత్సవ సందర్భంగా మంగళవారం ధర్మవరానికి చెందిన రామ లాలిత్యకు “ఉత్తమ సేవా నారి పురస్కార అవార్డును” ఆ సంస్థ వారి ద్వారా, దిశా పోలీస్ శాఖ డిఎస్పి ఆళ్ల శ్రీనివాస చేతులు మీదుగా పంపిణీ చేస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కళాకారుని రామల ఆదిత్య మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని, మరింత అభివృద్ధికి తాను కళా రంగంలో కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img