విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో ఉన్న వాల్మీకి కళ్యాణమంటపంలో కనీస సౌకర్యాలు, లేకపోవడంతో కళ్యాణం మంటపం యొక్క నిర్వహణ ఇబ్బందికరంగా ఉందని కళ్యాణ మంటపం యొక్క అభివృద్ధికి ఎంపీ నిధుల కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఉరవకొండ మండల వాల్మీకి సంఘం నాయకులు ఎంపీ తలారి రంగయ్య కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉరవకొండలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ రంగయ్యను వాల్మీకి కళ్యాణమంటపాన్ని సందర్శించాలని కోరడంతో ఆయన కళ్యాణ మండపాన్ని సందర్శించారు. కళ్యాణమండపంలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల వివాహాలు కూడా జరగడం లేదని కళ్యాణ మంటపం శిథిలావస్తుకు చేరుకుంటుందని పూర్తిస్థాయిలో సౌకర్యాలను కల్పించాలని వాల్మీకి సంఘం నాయకుల ఎంపీ కోరారు. అనంతరం ఎంపీ రంగయ్య స్పందించారు. కళ్యాణ మంటపంలో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయడానికి తను వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు వెలిగొండ నరసింహులు, ఇంద్రావతి సురేంద్ర, ముండాస్ ఓబులేసు, హావలిగి ఓబులేసు, వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.