Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం

విశాలాంధ్ర-పెనుకొండ : నియోజకవర్గానికి చెందిన పొగాకు రామచంద్ర ను రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ అభివృద్ధి మండల చైర్మన్ గా నియమితులు అవుతున్నట్లు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు ఆయన వాల్మీకి బోయ అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అలాగే బోయాలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు ఎన్నో పోరాటాలు చేశారు కోస్తాంధ్ర నుండి రాయలసీమ వరకు వాల్మీకి రథయాత్రను నిర్వహించారు అలాగే అమరావతిలో కూడా వాల్మీకుల సంక్షేమం కోసం ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు చేసినందున ఆయనకు ముఖ్యమంత్రి వద్ద ఎంతో గుర్తింపు వచ్చినందున యువకుడు ఉత్సాహవంతుడు పార్టీ అభివృద్ధికి కృషి చేయగలరని రాయలసీమ జిల్లాలలో బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నందున బోయ కులస్తులకు సమచితమైన పదవులు ఇచ్చి వారికి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నట్లు మిత్రులు తెలిపారు కార్పొరేషన్ పదవి రావడంతో స్నేహితులు బంధువులు రాజకీయ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img