విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం నగరంలో వికే మెమోరియల్ హాలులో జరిగిన ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా నిర్మాణ మహాసభల్లో ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా వంశీ తో పాటు 23 మంది కార్యవర్గ సభ్యులు 45 మంది కౌన్సిల్ సభ్యులను ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పి. నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్ బాబు, శివారెడ్డి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు సిద్ధమవుతామని, జిల్లాలో ఏఐఎస్ఎఫ్ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. మాపై నమ్మకం ఉంచి మాకు బాధ్యతలు అప్పగించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీకి, సిపిఐ, ఏఐఎస్ఎఫ్
జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.