విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణం శివరామిరెడ్డి కాలనీలో ఒంటరి మహిళగా జీవిస్తున్న వృద్ధురాలు పింజరి లాలెమ్మకు ఉరవకొండ 15వ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున శనివారం నిత్యవసర సరుకులు తో పాటు ఆర్థిక సహాయాన్ని చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. లాలేమ్మకు ప్రభుత్వం ద్వారా నెల నెల పింఛను వస్తుంది అయితే ఈ నెల వచ్చిన పింఛను మహిళకు ఇవ్వడానికి వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లగా ఆమె తలుపులు వేసుకొని ఎక్కడకు వెళ్ళింది ఐదవ తేదీ వరకు కూడా ఆమె కోసం గాలింపు చేసినప్పటికీ ఆమె అందుబాటులో లేకపోవడంతో పింఛను తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. అయితే ఆ వృద్ధ మహిళ శనివారం ఉరవకొండకు వచ్చి తనకు మంజూరైన పింఛన్ ఇవ్వాలని తన ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందని ప్రభుత్వం అందించే పింఛను ద్వారానే బతుకుతున్నాని గ్రామ సచివాలయ సిబ్బందితో ఆమె మొరపెట్టుకుంది. దీంతో అక్కడే ఉన్న వార్డు సభ్యులు మల్లికార్జున స్పందించి ఈ నెలకు మంజూరైన 2750 మొత్తాన్ని అలాగే ఆమె జీవనం కోసం నిత్యవసర సరుకులను కూడా ఆయన వృద్ధ మహిళకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ నరసింహులు, ఎంపీడీవో చంద్రమౌళి, ఐదవ సచివాలయ కార్యదర్శి పవన్, శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.