విశాలాంధ్ర – జెఎన్టియు: రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ జూలై 22 నుండి 30 వరకు ప్రభుత్వ హాస్టల్లో సందర్శన, వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి పేర్కొన్నారు. మంగళవారం నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, గురుకుల వసతి గృహాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవిక విషయాల అన్వేషణను చేపట్టి.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. సీట్లు పెంపు, ట్రంకు పెట్టెలు, నాన్నకు గదులు మరమ్మత్తులు, ప్రహర గోడలు నిర్మాణం, భద్రత వైఫల్యాలు, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, హరికృష్ణ, ఆనంద్ సమీర్ పవన్ నాని , మున్సూ ర్,ఇమ్రాన్ ,కార్తీక్, నాగేంద్ర పాల్గొన్నారు.