Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఓటర్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న

విశాలాంధ్ర – ధర్మవరం : ఓటర్ల సర్వేలు నియమ నిబంధనలు ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్, చంద్రబాబు నగర్, శాంతినగర్ లో నిర్వహిస్తున్న సర్వే ఓటర్ల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా కమిషనరే ఇంటిట తిరుగుతూ ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వేరేచోట ఉన్నారా? మృతి చెందారా? ఇల్లు మార్చారా? అన్న విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు బిఎల్ఓ, బిఎల్ ఏలు 35-40 ఓటర్లను టార్గెట్ గా సర్వే చేయాలని తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవకతవకలకు తావు ఇవ్వరాదని, నియమ నిబంధన ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసే విధంగా, తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో 1,00,603 మంది ఓటర్లు ఉన్నారని ఇప్పటివరకు దాదాపు తొమ్మిది వేల వరకు ఓటర్ సర్వేను పూర్తి చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఫారం-6 ద్వారా నూతన ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఈ ఓటరు సర్వే కార్యక్రమం ఈనెల 21వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నిరంతర ప్రక్రియ గా జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు యొక్క వివరాలను తెలుసుకొనే అవకాశం కూడా ఉందని తెలిపారు. సర్వేకు వచ్చే బిఎల్వో లకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img