Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఓటర్ సర్వే పారదర్శకంగా కొనసాగించాలి..

ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తిప్పే నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ఓటర్ సర్వేను పారదర్శకంగా బాధ్యతగా కొనసాగించాలని ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్డీవో తిప్పేనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం పట్టణంలోని పలుచోట్ల నిర్వహించబడుతున్న ఓటర్ సర్వే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బిఎల్ఓ, బిఎల్ఎ లతో ఇంటింటా తిరుగుతూ ఓటర్ సర్వే నిర్వహణ చేసిన తీరును నేరుగా ఓటర్లతో అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? అందరికీ ఉన్నాయా? లేదా? కుటుంబములో ఎవరైనా వేరేచోట, వేరే ఊర్లో ఉన్నారా? అన్న వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితా ప్రకారం ఇంటి నెంబర్ తో సహా కరెక్టుగా ఉందా? లేదా? అన్నది కూడా వారు పరిశీలించారు. అనంతరం బిఎల్ఓకు, బిఎల్ఏ ఓటర్ సర్వే విధానంపై మరికొంత అవగాహన కల్పిస్తూ, ఎక్కడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు 35 కుటుంబాలను ఓటర్ సర్వేలో సర్వే చేయాలని తెలిపారు. అనుకున్న షెడ్యూల్ తేదీకు పూర్తి చేసి, ఎప్పటికప్పుడు వివరాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img