Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఏసిబికి పట్టుబడ్డ వీఆర్వో వెంకట రమణారెడ్డి


. లంచము తీసుకుంటూ పట్టుబడిన వైనం
. అవినీతిపై ముందే హెచ్చరించిన విశాలాంధ్ర
. పట్టించుకోని తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది

విశాలాంధ్ర -మిడుతూరు : నిజాయితీగా పనిచేయాల్సిన విఆర్వోలు ఒక ప్రైవేటు ఇంటిని అద్దెకు తీసుకొని విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కిన సంఘటన మండల కేంద్రమైన మిడుతూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజవర్గ పరిధిలో గల మిడుతూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు భవనంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్వోలు అద్దెకు తీసుకొని ఉంటూ అక్రమ కార్యకలాపాలకు తెరలేపారు. మండలంలోని జలకనూరు గ్రామ విఆర్ఓ వెంకటరమణారెడ్డి ,వెంకట రమణయ్య అనే రైతు దగ్గర 7000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. ఏసీబీ డి.ఎస్.పి వెంకటాద్రి మాట్లాడుతూ జలకనూరు గ్రామానికి చెందిన రైతు వెంకట రమణయ్య తనకున్న మూడు ఎకరాల పొలాన్ని తన కుమార్తెలకు రిజిస్టర్ చేయించి ఇచ్చాడు. ఆన్లైన్లో తన కూతుర్ల పేర్లను ఎక్కించాలని విఆర్ఓ ను అడగగా అందుకు 50వేలు లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఒప్పుకొని రైతు 10,000 ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని మొదటి విడతగా 3000 రూపాయలు కొద్ది రోజుల క్రితం ఇచ్చాడు. మిగతా 7000 రూపాయలు ఈరోజు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి విఆర్ఓకు ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నామని డిఎస్పి తెలిపారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img