Monday, September 25, 2023
Monday, September 25, 2023

పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు ఎమ్మెల్యే కార్యాలయం నందు సోమవారం ఎమ్మెల్యే శంకర్ నారాయణ మరియు డిసిసి చైర్మన్ లిఖిత సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం నాడు ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాలంటీర్లు సేవా దృక్పథంతో పనిచేస్తున్నందున వారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం మహిళలను ట్రాప్ చేస్తున్నారని మహిళల విషయాలను కుటుంబ వివరాలను ప్రభుత్వ పెద్దలకు అందజేసి మహిళలు ట్రాప్కు గురవుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని లేపుతున్నాయి మహిళల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని వాలంటీర్లు కరోనా సమయంలో సొంత మనుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేశారని ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటారని కుటుంబ సర్వేలు ఫీవర్ సర్వేలు చేస్తున్నారని వారి మీద వ్యాఖ్యలు చేయడం మీ అజ్ఞానానికి నిదర్శనమని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవడం చెప్పడం వలన నీ వ్యక్తిత్వ దిగజారుడుతానానికి నిదర్శనమని వారు తీవ్రంగా మందలించారు నీవు వాలంటీర్లకు మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే మహిళలు వాలంటీర్లు నిన్ను నిలదీస్తారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి, కన్వీనర్ బాబు, నగర పంచాయతీ చైర్మన్ ఉమర్, సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మల్లికార్జున, మారుతి, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img