Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

విశాలాంధ్ర-తాడిపత్రి: పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పుట్లూరు రోడ్ ఆర్డిటి కాలనీ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారము విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు తన ఉనికి కోసం నిత్యం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ గూర్చి సినిమాలో ఉన్నదని ఆరోపిస్తున్నారు. సినిమా అనేది ఒక కథ మాత్రమే కానీ ప్రజలకు ఎంతో కొంత సమాజంలో జరుగుతున్న విషయాన్ని గూర్చి చెప్పేదే సినిమా అని. ఎవరి వ్యక్తిత్వాన్ని గూర్చి చూపించేది కాదన్నారు. తమరు మంత్రి అయినప్పటి నుండి తమ శాఖను ఎంతవరకు అభివృద్ధి చేశారో వాటిని గూర్చి ప్రజలకు తెలియజేయండన్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు, నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. కావున ఇప్పటికైనా తమ శాఖ అయిన జల వనరుల శాఖపై దృష్టి సారించి ప్రజలకు సేవ తెలియచేయడని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img