Monday, December 5, 2022
Monday, December 5, 2022

నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి

విశాలాంధ్ర – ఉరవకొండ : అధిక వర్షాలకు తెగులు సోకి నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి పేర్కొన్నారు సోమవారం ఉరవకొండ అగ్రికల్చర్ ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరవకొండ డివిజన్ పరిధిలో దాదాపు 53, వేల ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారని అయితే
వైరస్ సోకడంతో తొలగించారన్నారు ఎకరాకు 80వేలు రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతుల నష్టపోయినప్పటికీ వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట తొలగించిన రైతు వివరాలు సేకరించి నివేదికల సిద్ధం చేసి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపాలన్నారు ప్రభుత్వం కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరు చేయాలని చెబుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతును ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏడిఏ పద్మజాకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శులు జ్ఞానమూర్తి,మధుసూదన్, కౌలు రైతు సంఘం నాయకులు సిద్ధప్ప,వన్నూరు స్వామి,నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img