Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తాం

ఎంపీడీవో సౌజన్య కుమారి
విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధి హామీ పథకం ద్వారా విరివిరిగా పండ్ల తోటల సాగుకు రైతులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని ఎంపీడీవో సౌజన్యకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిధిలోని నిమ్మలకుంట పోతుల నాగేపల్లి గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా సాగు చేస్తున్న గులాబీ చీని పంట తోటలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల ప్రతి రైతు కూడా ఏపీఓను సంప్రదించి తగిన సూచనలు, సలహాలను పొందవచ్చునని తెలిపారు. తదుపరి పోతుల నాగేపల్లి సచివాలయాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సచివాలయ సిబ్బందితో వారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు విధిగా అందేలా తగిన చర్యలు తీసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత, సచివాలయ ఉద్యోగులదేనని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ- అనిల్ కుమార్ రెడ్డి, జేఈ- నాగేంద్ర, టీఏ-చంద్రకళ, ఎఫ్ఏలు శివకుమార్, మురళి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img