Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

బషీర్బాగ్ ఉద్యమంలో అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం…

విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు మా పోరాటం ఆగదు……
పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే గ్రామీణ స్థాయినుండే తిరుగుబాటు తప్పదు…..
వామపక్ష పార్టీల నాయకులు…

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వామపక్షాల పిలుపుమేరకు 2000 ల సంవత్సరం ఆగస్టు 28 న బషీర్బాగ్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమకారులను ఆనాటి ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయడానికి కాల్పులు జరిపిందని గుర్తు చేశారు.ఆ సమయంలో పోలీసుల కాల్పుల్లో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కామ్రేడ్ బాలస్వామి, రామకృష్ణ,విష్ణువర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేపథ్యంలో అసువులు బాసిన అమరులకు సోమవారం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పెద్దన్న,సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్యూసిఐ రాఘవేంద్ర అమరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు జాఫర్ 23 ఏళ్ళ క్రితం టిడిపి ప్రభుత్వం నిర్ణయించిన విద్యుత్ చార్జీల పెంపుపై వామపక్షాల పిలుపుమేరకు పెద్ద ఎత్తున ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కమ్యునిస్టు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆక్రమం లోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడంతో పేద ప్రజలతోపాటు రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ జిల్లాల్లో పంపు సెట్లతో నీటిని వదులు కొని లక్షల ఎకరాల పంటను పండించుకోవడం జరుగుతోందని వాటికి విద్యుత్ మీటర్లు బిగిస్తే ఆన్నదాతలు ఆర్థికంగా చితికి పోతారని విచారం వ్యక్తంచేశారు.ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటు అనాలోచిత నిర్ణయాలను తిప్పి కొట్టెందుకు వామపక్ష నాయకులు,కార్యకర్తలు బషీర్బాగ్ సంఘటన గుర్తు చేసుకోవాలని అలాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాగరాజు,సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు రమణ, అల్లి పీరా,ఐద్వా నాయకురాలు సావిత్రి, సిపిఎం నాయకులు ఆవాజ్ వలి,మున్నా,ఆర్.వి నాయుడు, సిఐటియు నాయకుడు నాగేంద్ర కుమార్,రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img