శ్రీహరికోట డీజీఎం.. సి. మురళీధర్
విశాలాంధ్ర – ధర్మవరం:: భారతదేశంలో సైన్స్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరుస్తూ, ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా కృషి చేస్తామని శ్రీహరికోట డీజీఎం.. సి.మురళీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కే. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో వారి అంతరిక్ష వైద్యానిక ప్రదర్శనను(స్పేస్ ఆన్ వీల్స్.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది.. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తోపాటు ఇతర మండలాల నుండి కూడా వేలాదిమంది విద్యార్థినీ ,విద్యార్థులు, యువతి, యువకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ యొక్క ప్రదర్శన పై సంతృప్తిని వ్యక్తం చేసి, ఓ మంచి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇలాంటి ప్రదర్శన మా జీవితంలో మరువలేమని తెలిపారు. ఈ ప్రదర్శనను మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ నాగరాజు, డివి ఈవో రఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ప్రదర్శన పట్ల వారు సంతోషాన్ని వెలిబుచ్చారు. వారు మాట్లాడుతూ భారతదేశంలోని శ్రీహరికోట సైన్స్ టెక్నాలజీలో ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించిందని, మూడ నమ్మకాలను పారదోలి, స్వయం శక్తితో,సైన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని,మానవ జీవన ప్రమాణం తెలియపరుస్తుందన్నారు. అనంతరం శ్రీహరికోట డీజీఎం.. సి. మురళీధర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన నిర్వహించడం వలన విద్యార్థిని, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహనతో పాటు మరింత ప్రోత్సాహమును కలిగిస్తున్నామని తెలిపారు. స్పేస్ ఫలితాలను అందరికీ తెలిసే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తున్నామని, రాకెట్ల యొక్క ఉద్దేశ్యము వాటి ఫలితాలను వివరించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆదిత్య, చంద్రమోహన్- 3, తదితర రాకెట్ల గూర్చి వివరించడం జరిగిందన్నారు. శ్రీహరికోటలో అంతరిక్ష యానాన్ని తిలకించడానికి ప్రతి సంవత్సరం పదివేల మందికి ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేసి, వీక్షించడానికి అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని టీవీలలో మొదటగా ప్రచురించిన తర్వాత, ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు కూడా చిన్న వయసులోనే సైన్సును పూర్తిగా అవగాహన చేసుకుని టెక్నాలజీతో మన దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా కృషి చేయాలని, ఇప్పటికే శ్రీహరికోట పరిశోధన సంస్థ ప్రపంచంలోనే ఓ మంచి గుర్తింపు లభించడం ఆనందదాయకమని వారు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సైన్సు, గణితం బోధించే ఉపాధ్యాయులు గాని, అధ్యాపకులు గాని నిష్ణాతులైన విద్యార్థులను మరింతగా తీర్చిదిద్ది, శాస్త్రవేత్తలుగా తయారు చేయవలసిన అవసరం నేడు ఎంతో అవసరమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తో పాటు శ్రీహరికోట శాస్త్రవేత్త మనోహర్ రెడ్డి, శ్రీహరికోట టీం.. అనిల్, బాబురావు, ప్రసాద్, కిషోర్ వి. మురళి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, కళాశాల అధ్యాపకుల, బోధ నేతల బృందం, వేలాదిమంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.