కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అశ్వత్థ నారాయణ
విశాలాంధ్ర – తనకల్లు : కదిరిలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ అశ్వర్థ నారాయణ పేర్కొన్నారు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మండల కన్వీనర్ తోపు పారేసు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి దిశా నిర్దేశం కాంగ్రెస్ పార్టీని అని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు రోడ్లు లేవు పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ పార్టీలో ముందున్న నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి దేశ సంరక్షణలో భాగస్తులు కావాలన్నారు ఇప్పుడున్న మూడు పార్టీలకు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్టే అని తెలిపారు ఉచిత కరెంటు రైతులకు రాయితీలు ఆరోగ్యశ్రీ ఫీజు రియబర్డ్స్ మెంటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టినవేనన్నారు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని 50 గృహాలకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజాస్వేచ్ఛను హరించిన ఘనత వైయస్సార్ పార్టీకే దక్కుతుందన్నారు డ్రిప్పు ఎరువులపై సబ్సిడీలు లేకుండా రైతులను మోసం చేసిన పార్టీ వైయస్సార్ పార్టీ అన్నారు ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికొస్తే ప్రైవేటీకరణ గుత్తేదారుల దోపిడీ వ్యవస్థలను నడుపుతోందన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తివేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. పట్టణాల్లో మాల్స్ లాగా మండల కేంద్రంలో కూడా మాల్స్ వచ్చి చిరు వ్యాపారులను నిర్వీర్యం చేసే ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు. ఇలాంటి విషయాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సేవ చేయడం మేలు చేయడం ఒక కాంగ్రెస్ పార్టీకే తెలుసు అన్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరించి 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఎర్రకోటపై జెండా ఎగరేసే విధంగా మనం సైనికుల్లా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర సెక్రెటరీ నచ్చు బాలకృష్ణ యాదవ్ బీసీ మండల కన్వీనర్ ఎస్సీ సెల్ కన్వీనర్ నరసింహులు మస్తాన్ బాబు తో పాటు కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొన్నారు.