భారీ వర్షం నేపథ్యంలో పలు కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలో చాలా ప్రాంతాల్లో కాల్వలపై ఆక్రమణల వలన చిన్నపాటి వర్షాలకే ఇబ్బందులు తలెత్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం వలన కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు వచ్చిన నేపథ్యంలో ఆయన కేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలోని 48వ డివిజన్ లోని సోమనాథ్ నగర్ తో పాటు పలు కాలనీల్లో పర్యటించారు. డ్రైనేజీల నుంచి నీరు పొంగి పొర్లి.. ఇళ్లలోకి నీరు చేరి కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. రోడ్లపై బురద, మురుగు పేరుకపోవడంతో వెంటనే క్లీనింగ్ చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వర్షపు నీరు, డ్రైనేజీ నీరు ఉన్న చోట కూడా ఎమ్మెల్యే ఆ నీటిలో నడుస్తూ ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వంకలపై ఇష్టానుసారంగా ఆక్రణలు కనిపిస్తున్నాయని..కొన్ని చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉందన్నారు. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. వర్షాల నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందిని ఇతర విభాగాల్ని అప్రమత్తం చేశామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.