Friday, April 26, 2024
Friday, April 26, 2024

టిట్కో జగనన్న ఇండ్లు సందర్శిస్తాం

అనంతపూర్ జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: స్థానిక పుట్లూరు రోడ్డు ఆర్డిటి కాలనీ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాల యంలో శుక్రవారం జనసేన పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గ పరిధి లోని అన్ని గృహ నిర్మాణ పథకాలు, జగనన్న కాలనీలు, టిడ్కో ఇల్లు సందర్శించి ఒక్కొక్క కాలనీలో ఎన్ని ఇళ్ళులు మంజూరైనాయి.ఇప్పటి వరకు ఎంత మంది లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం నిధులు అందజేసింది, బేస్మెంట్, లింటెల్, రూఫ్ దశలో ఎన్ని ఇల్లు ఉన్నాయో పరిశీలిస్తూ, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందించార లేదా అనే సముదాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, లబ్ధిదారుల ఇబ్బందులన్ని రికార్డు చేస్తామన్నారు.ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్ష వేల రూపాయలు కాకుండా ఎంత మొత్తం లబ్ధిదారుల చేతి నుంచి పడుతుందో, జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు ఎంత ధర చెల్లించారు. ఎంత ఖర్చు చేశారో ప్రస్తుతం ఆ భూముల పరిస్థితి ఏ విధంగా ఉందో, కాలనీలో మౌలిక సదుపాయాలను పరిస్థితిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫోటోలు వీడియోలు తీసి ఈనెల 14వ తేదీన సోషల్ మీడియా ద్వారా జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ప్రభుత్వానికి ప్రజలకు తెలిసేలా చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్ అయుబ్, గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మణికంఠ, సుదర్శన్, గోపి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img