Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేస్తాం

జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల రామ్ కుమార్

విశాలాంధ్ర – ధర్మవరం : అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేస్తామని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల రామ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా స్థానిక వాసవి సర్కిల్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల రాంకుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా సంయుక్త రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు అన్నారు. అలాంటి మహనీయుని ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించేంతవరకు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు మరువలేనివి అన్నారు. చివరకు తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి, ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములు కే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి రేపాకుల సురేష్ బాబు, జాయింట్ సెక్రెటరీ గ్రంథే శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు, పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి భీమిశెట్టి కృష్ణమూర్తి, కోశాధికారి ఓవి ప్రసాద్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోల మడ రూపా రాగిణి, నల్లపేట మంజు సంయుక్త, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు అంబటి అవినాష్, ఆవోపా సత్యసాయి జిల్లా ఇంచార్జ్ అన్నా లక్ష్మీనారాయణ, ఆవోపా పట్టణ అధ్యక్షులు డాక్టర్ శీభా నగేష్ గుప్తా, కలవల కిషోర్, దోరణాల ఫణి రాజ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img