జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటాం..
- మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి
- సమాజ అభ్యున్నతికి వారధులు జర్నలిస్టులు : డిప్యూటీ మేయర్ సాహిత్య వాసంతి
- విశాలాంధ్ర -అనంతపురం- వైద్యం : సమాజ హితం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులు.. ఇప్పటికీ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని, మీ సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని, నిరంతరం అందుబాటులో ఉంటానని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఁఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 67వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏపీయూడబ్ల్యూజే పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 25 మంది వెటరన్, రిటైర్డ్, సీనియర్ జర్నలిస్టులకు ముఖ్య అతిథులు డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, ఐజేయు సభ్యులు గుత్తా ప్రభాకర్ నాయుడు శాలువాలు కప్పి, బొకేలు, గిఫ్టలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొగటం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, మీ మేలు జన్మలో మర్చిపోలేనని, ప్రెస్ క్లబ్ అభివృద్ధి, ప్రెస్ క్లబ్ కు అవసరమైన పార్కింగ్ ప్లేస్, నివేక్షిత స్థలాలు లేని వారికి ఇళ్ల కోసం అవసరమైన స్థల సేకరణకు కృషి చేస్తానన్నారు. డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ, సమాజం పట్ల జర్నలిస్టుల కృషి ఎనలేనిదని అన్నారు. జర్నలిస్టులు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, విలేకర్ల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని, జర్నలిస్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుత్తా ప్రభాకర్ నాయుడు, పతకమూరి నాగరాజు, ఆజాద్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డేనియల్,
సబ్ ఎడిటర్ రామాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ సనప రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఎండి రసూల్, మరికొందరు జర్నలిస్టులు ప్రసంగిస్తూ, జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించిన నాటి నుంచి సాగించిన ప్రస్థానాన్ని నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ముఖ్య అతిధులు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు వెటరన్, రిటైర్డ్ జర్నలిస్టులు సీనియర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, గాజుల నాగభూషణం (ఎడిటర్ మాపటేల), ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి చౌడప్ప, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు, అడ్ కమిటీ సభ్యులు కే పి. కుమార్, కమిటీ సభ్యులు ఆంధ్రప్రభ ఎడిషన్ ఇంచార్జ్ లోకరాజ్, ప్రదీప్ కుమార్ రెడ్డి (విశాలాంధ్ర), జగదీష్ (10టీవీ), చలపతి (ఎడిటర్ నమస్తే అమరావతి), రమేష్ కుమార్ (ఆంధ్రప్రభ), రాజా హోన్నూర్ ( ప్రజాభూమి బ్యూరో ఇంచార్జ్), మల్లికార్జున శర్మ, సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు.