Friday, December 8, 2023
Friday, December 8, 2023

పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం:ఆలూరు సాంబ శివారెడ్డి

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: పేదల సంక్షేమమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఆలూరు సాంబ శివారెడ్డి అని పేర్కొన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం పి. కొత్తపల్లి గ్రామంలో 24 మంది పేదలకు వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలును ఆలూరు సాంబశివారెడ్డి పంపిణీ చేశారు. మహిళల పేరిట నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేయటం తో మహిళా సాధికారితకు ప్రభుత్వం పట్టం కట్టిందన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు ఇంటి పట్టాలు వారి పేరు మీదనే అందజేస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img