విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని రాజేంద్రనగర్ కు చెందిన రామాంజనేయులు, భార్య నాగరత్నములు ఆదివారం రాత్రి ఓ పనిమీద ద్విచక్ర వాహనంలో అనంతపురానికి వెళుతుండగా, బత్తలపల్లి మండలంలోని బత్తలపల్లి పోలీస్ స్టేషన్ దాటగానే కొద్ది దూరంలో హైవే రోడ్డు వద్ద అతివేగంగా వెళుతూ స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా వెళ్లారు. దీంతో అకస్మాత్తుగా టూవీలర్ ఎగరడంతో వెనకాల కూర్చున్న భార్య నాగరత్నమ్మ ఒక్కసారిగా ఎగిరి పడి తనకు తీవ్రమైన గాయం అయింది. గమనించిన వాహనదారులు బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి చేర్పించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందింది అని వైద్యులు తెలిపారు. భార్యాభర్తలు చాకలి వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించే వారిని, వీరికి ఒక కుమారుడు ఒక కూతురు కలరని తెలిపారు. బత్తలపల్లి పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.