Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీలో వణుకు పుడుతోంది

విశాలాంధ్ర -పెనుకొండ : నారలోకేశ్ యువగలం పాదయాత్ర 200 రోజుకు చేరుకున్న సందర్భంగా గురువారం సంఘీభావం తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమె మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకొని 2700 కి.మీ. మైలురాయికి చేరనున్న సందర్భంగా యువగళం సారథి నారా లోకేష్ పాదయాత్ర కు మద్దతు గా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సంఘీభావం తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు పాదయాత్రకు ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది .ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగళం లోకేష్ పాదయాత్ర 77 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది.లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంతో ముఖ్యమంత్రి జగన్ వెన్నులో వణుకు మొదలైంది , పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడంతో ప్రతి టీడీపీ కార్యకర్తకు ఎంతో సంతోషం చేస్తున్నారని తెదేపా కార్యకర్తలలో మంచి జోష్ పెరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img