Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

నీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో ఆఫీస్ ముట్టడించిన మహిళలు

గుక్కెడ నీళ్లు కోసం గుప్పెడు కష్టాలు నీటి సమస్య పరిష్కరించాలి మహాప్రభు అంటూ ఆందోళన చేపట్టిన మహిళలు

విశాలాంధ్ర- శెట్టూరు : గత నెల రోజుల నుండి మండల కేంద్రంలో సినిమా హాలు ఏరియాలో నీటిఎదడి నెలకొంది గత నెల రోజుల నుంచి గ్రామ సర్పంచ్ పంచాయతీ అధికారులకు అనేకసార్లు నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాది చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు ఆవేదన చెందారు విసుగు చెందిన మహిళలు గురువారం ఎంపీడీఓ ఆఫీస్ ముట్టడించి ఆందోళన చేపట్టారు మా ఏరియాకి నీటి సమస్య పరిష్కరించేంతవరకు ఆందోళన చేపడతామని అధికారులకు తెలియజేశారు ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా అధికారులు మాత్రం నీటి సమస్య పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మహిళాలు అధికారులపై మండిపడ్డారు ఇంత నిర్లక్ష్యం ఉంటే సమస్యలు ఎవరు పురస్కరిస్తారంటూ తమ గోడను మీడియా దృష్టికి తీసుకువచ్చారు ఇప్పటికైనా అధికారులు గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు స్పందించి మాకు నీటి సమస్య పరిష్కారం చూపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉమా, రాజన్న, నాగరాజు, వన్నూరు స్వామి, వేదవతి,లక్కవ్వ, లతమ్మ ,మహాలక్ష్మి, లలితమ్మ కళావతి, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img