Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

దిశా డి.ఎస్.పి.. కెవిఎన్. వరప్రసాద్

విశాలాంధ్ర – ధర్మవరం:: గ్రామీణ ప్రాంతాలలో గల మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని దిశా డి.ఎస్.పి.. కెవిఎన్. వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ మహిళ పోలీసులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండడంతో పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాకాలపై నిఘా ఉంచి,ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఐకు గాని, ఎస్సై కిగాను సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. డ్యూటీ చార్టులో ఉన్న విధులను సక్రమంగా చేయాలి అని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా దిశా యాప్ పై పట్టణ గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు యువతులకు బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గౌస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img