Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

మెడికల్ కళాశాలలో ఉమెన్స్ డే సంబరాలు

మహిళల సంతోషమే దేశ ప్రగతికి సూచిక
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ యూనిట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ వింగ్, ఇన్నర్ వీల్ క్లబ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల మహిళ సంఘం, పల్స్ జిమ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో పనిచేస్తున్న డాక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర మహిళలందరికీ ఉచితంగా షుగర్, బిపి, బాడీ మాస్ ఇండెక్స్, పాటల పోటీలు, త్రో బాల్, వాలీబాల్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, బకెట్ బాల్ , స్పీడ్ వాకింగ్, తాడు లాగుడు పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన విజేతలకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ రఘునందన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ సుమన గోపీచంద్, డాక్టర్ హైమావతి, డాక్టర్ భవాని, డాక్టర్ శైలజ, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ప్రతిమ, పద్మ, వేదం శ్రీవల్లి, పల్స్ జిమ్ వ్యవస్థాపకులు రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్ తదితరుల చేతుల మీదుగా బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళ చైతన్యవంతంగా, శక్తివంతంగా, నాయకత్వ లక్షణాలతో, పోరాట పటిమతో, ఉన్నప్పుడే మన దేశాన్ని అగ్ర పదంలో తీసుకు వెళ్ళగలమని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అసాంక్రమిక వ్యాధులైన షుగరు ,బిపి, అధిక బరువు అనేక అనర్ధాలకు దారితీస్తుందని మా కళాశాలలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ఎన్ఎస్ఎస్ యూనిట్ పెద్ద ఎత్తున ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని 2K22 బ్యాచ్ మెడికోలు నిర్వహించడం వారిలోని నాయకత్వం పొట్టి మనం చూపిస్తుందని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ షారోన్ సోనియా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img