ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ని కలిసిన సత్య సాయి జిల్లా వై ఎస్ ఆర్ సి పి నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రెటరీగా జి.ఆర్. రామ్మోహన్ని అధిష్టాన వర్గం ఇటీవల నియమించడం జరిగినది. ఈ సందర్బంగా శుక్రవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ని జి. ఆర్ రామ్మోహన్ తన బృందం తో కలవడం జరిగినది. వారితో ఎమ్మెల్యే. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యం గా ఈ జిల్లా లో వై ఎస్ ఆర్ సి పి పార్టీ అభ్యున్నతి కోసం అందరూ బాగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.తాము అంకిత భావం తో పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేస్తామని, అదేవిధంగా రాబోవు ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని జి.ఆర్ రామ్మోహన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.