Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జిల్లా క్షయ నివారణా కార్యాలయములో అధునాతన ఎక్సరే ప్రారంభం

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవ సందర్బంగా జిల్లా క్షయవ్యాధి నివారణా కేంద్రము లోని సెంట్రల్ టిబి డివిజన్ నుండి వచ్చిన ఆధునాతన 500 ఎం ఏ ఎస్ డిజిటల్ ఎక్సరే మెషిన్ ను జల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి దొర ప్రారంభించారు. అలాగే దాతల సహాయముతో ఆధునికరించిన క్షయ వ్యాధి నిర్దారణా కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి, జిల్లా క్షయ నివారణా అధికారి దాతలైన ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ సుధీంద్ర, ఛైర్మెన్ కొప్పుల మీనాక్షమ్మ ట్రస్ట్ రవికాంత్ రమణ చే ప్రారంభింప జేశారు. ఈ సందర్బంగా దాతలు డాక్టర్ సుధీంద్ర ని రవికాంత్ రమణ ని జిల్లా వైద్యాధికారి మరియు క్షయ నివారణ అధికారి వారి దాత్రుత్వమును అభినందించి చిరు సత్కారం చేశారు . ఈ కార్యకమములో పి ఒ డి టి డాక్టర్ సుజాత, జిల్లా మలేరియా అధికారి ఓబులు , ఎన్ జి ఒ జిల్లా కార్యదర్శి చంద్ర మోహన్, ఎన్ జి ఒ నగర కార్యదర్శి శ్రీధర్ బాబు , జిల్లా రేవతి, సూరి,అంజి, నారాయణ, వెంకటష్, ఖాదర్, గౌస్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img