Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పరిసర ప్రాంతాలలో క్షయ వ్యాధితో బాధపడుతున్న 40 మందిని గుర్తించి లయన్స్ క్లబ్ నిర్వాహకులు పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో క్లబ్ గవర్నర్ చంద్ర ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిగ్రస్తులకు  ఉరవకొండ లయన్స్ క్లబ్ సభ్యులు  పౌష్టికాహారం అందించే కిట్లను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు  సామాజిక సేవా కార్యక్రమాలలో ఉరవకొండ లయన్స్ క్లబ్ చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు .ఇంకా ఈ కార్యక్రమంలో   లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున, సభ్యులు లక్ష్మీనారాయణ, బాలచంద్ర, సూర్యనారాయణ, సి. నాగేశ్వరరావు, ఎంసీ నాగభూషణం, గణేష్ బాబు ప్రభాకర్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img