Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జిల్లా నుండీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వై.మోహన్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వినియోగ దారుల సంఘాల సమావేశ ము విజయవాడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా ఉన్నా అన్నీ జిల్లాల నుండీ వినియోగ దారుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
వినియోగ దారుల సంఘాలను బలోపేతము చేయడము, ప్రజలకు పెద్దయెత్తున అవగాహన కార్యక్రమములు చేపట్టడము, విద్యాసంస్థలలో వినియోగదారుల క్లబ్‌లు ఏ ర్పాటు చేయడము వంటిి అనేక అంశాల చర్చించారు.
తదుపరిందరీ సభ్యులు అందరి ఆమోదం మేరకు రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎంపికను నిర్వహించారు.
క్యాప్కో(కాన్ఫడరేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా అనంతపురం జిల్లా నుండీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వై.మోహన్ ను ఉపాధ్యక్షుడు గా ఎన్నుకొన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img