Friday, February 3, 2023
Friday, February 3, 2023

బీసీ సదస్సుకు తరలి వెళ్లిన వైసీపీ నేతలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని వివిధ గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు విజయవాడలో జరుగు బీసీ గర్జనకు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికేంధ్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందులో భాగంగానే మూడు రాజధానులకు తాము మద్దతు తెలిపుతున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు పెద్ద పీఠ వేయడం వంటి వాటికి మద్దతుగా విజయవాడలో బుధవారం జరిగే బీసీ గర్జనకు విజయవంతానికి తరలి వెళ్లారు. ఇందులో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, వైసీపీ నాయకులు రవిచంద్రా రెడ్డి, భీమన్న, రామాంజని తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img