Friday, June 9, 2023
Friday, June 9, 2023

వైసీపీ యూత్ కన్వీనర్ సత్తిరెడ్డి జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి భర్త, వైసీపీ మండల యూత్ కన్వీనర్ సత్తిరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సత్తిరెడ్డిని పూలమాలలతో ఘనంగా సత్కరించి భారీ కేకును కట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో అలంకరించాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉందాలని కాంక్షించారు. కార్యక్రమంలో కన్వీనర్ జూటూరు శేఖర్, ఎంపీపీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img