Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

20న అనంతపురంలో యోగా అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జూన్ 20 తారీఖు మంగళ వారం ఉదయం 7:30 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ నుండి యోగ అవగాహన ర్యాలీ జరుగుతుందని అనంతపురం ప్రభుత్వ ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు డాక్టర్. నల్లపాటి తిరుపతి నాయుడు. డాక్టర్. రాంకుమార్ డాక్టర్ రఫీక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం జూన్ 21 తేదీన అనంత పురం నగరం లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాల ప్రదర్శన జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img