విశాలాంధ్ర -ధర్మవరం : ఆధునిక జీవన విధానములో యోగాకు ఎంతో ప్రాముఖ్యత కలదని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణములోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగము ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసిసి విభాగాలు కలిసి నిర్వహించారు. తదుపరి అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా కలిసి పలు యోగ ఆసనాల యొక్క ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగా ఆరోగ్యముతో పాటు ఫిట్నెస్ను కూడా అద్భుతంగా మార్చుతుందని, రోజువారి జీవనంలో యోగా ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసిస్తే ఆరోగ్యముగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీముల్లా, కిరణ్ కుమార్, పావని, పుష్పావతి, గౌతమి, స్వామి తో పాటు బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.