Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

యోగేశ్వర్ నేత సేవలు అనన్యమైనవి

అభయ హస్తా సేవాసమితి గౌరవ అధ్యక్షులు సోలిగాళ్ళ వెంకటేశులు

విశాలాంధ్ర – ధర్మవరం : జ్యోతిష్య రంగంలో సేవా పురస్కారములు అందుకొని విశేష సేవలు దాసరి యోగేశ్వర్నేత అందించడం శుభదాయకమని అభయ హస్తా సేవాసమితి గౌరవాధ్యక్షులు సోలిగాల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సాంస్కృతిక మండలి లో జ్యోతిష్య నిమారాలజీ రంగాలలో విశేష సేవలు అందించిన దాసరి యోగేశ్వర్ నేతను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణానికి చెందిన దాసరి యోగేశ్వర్ నేత ఈటీవీలో నెల్లూరు జిల్లాలో విశ్వంబరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాలు అందుకోవడం సంతోష్దాయకమన్నారు. అంతేకాకుండా జ్యోతిష్య రంగాలలో వినూత్న కార్యక్రమాలను చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో చేస్తున్న కృషి అభినందనీయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, అభయ హస్తా సేవాసమితి అధ్యక్షులు బాలం శ్రీనివాసులు, బండారు ఆదినారాయణ, యుగంధర్, విశ్వహిందూ పరిషత్తు జిల్లా అధ్యక్షులు పులిచెర్ల వేణుగోపాల్, దాసరి మంజునాథ్, మాయకుంట్ల సత్యనారాయణ, బాలం విశ్వనాథ్, దుషా రామకృష్ణ, బాలం ఆదిశేషు, పూజారి లక్ష్మీనారాయణ, పామిశెట్టి వెంకటేశులు, పెరుమాళ్ళ, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img