Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

తల్లిపాలు వారోత్సవాలలో వైయస్సార్ సంపూర్ణ పోషక కిట్టులు పంపిణి

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ఐసిడిఎస్ పరిధిలోని కొత్తపేట అంగన్వాడి సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించినారు, అందులో భాగంగా బుధవారం గర్భవతులకు వైఎస్సార్ సంపూర్ణ పోషక పథకం కిట్లను లబ్ధిదారులకు అందజేశారు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించబడునని తల్లిపాలు గురించి అవగాహన కల్పించారు, బిడ్డ పుట్టినప్పటినుంచి గంటలోపే తల్లిపాలు తాపడం ప్రారంభించాలి. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ఏడవ నెల నుండి తల్లిపాలతో పాటు అదనపు ఆహారము ఇవ్వడం తల్లిపాలు కొనసాగించడం వలన తల్లికి క్యాన్సరు, గుండె నొప్పులు, రాకుండా నివారించబడతాయి తల్లిపాలు బిడ్డకు కొనసాగిస్తూ బిడ్డకు ప్రతినెల తూకం వేయిస్తూ పిల్లల పెరుగుదల ఎదుగుదలను చూసుకోవలసిన అవసరం ఉన్నదని అవగాహన కల్పించారు పిల్లల తల్లులకు గర్భవతులకు బాలింతలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వర్ణలత సి ఎస్ డి టి ప్రభావతమ్మ కౌన్సిలర్ తయుబ్ సిడిపిఓ శాంత లక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలత, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img