జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : వైసిపి నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారి స్వగృహంలో విలేకరులతో పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి లో ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి మంత్రి రమేషు, రోజాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఇలాగే మున్ముందు మాట్లాడితే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురిని మెంటల్ హాస్పిటల్ కు చేర్పిస్తామని తెలిపారు. మొదట మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి రాజధాని ఏదో చెప్పాలని సవాలు విసిరారు. ప్రస్తుత మహిళా మంత్రి రోజాను చూసి మహిళా లోకం సిగ్గుపడుతోందని, మహిళలే గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనదని తెలిపారు. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి నేడు అధికారంలో ఉన్న మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఇక్కడ ఎవరూ భయపడేది లేదని, మున్ముందు ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసలు మంత్రులకు నాయకులకు పరిజ్ఞానం ఉందో? లేదో తెలుసుకోండి అని హితవు పలికారు. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుతోనే ముందుకు వెళుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు… ఎందుకంటే ప్రజా శ్రేయస్సు కొరకు మాత్రమే అని తెలిపారు. మీ ముఖ్యమంత్రి కుంభకోణాలు కేసులు, అక్రమ కేసులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు అని పార్టీ నాయకులకు గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో 29 వేల మంది ఆడవారు కనపడటం లేదని, మిస్సింగ్ కేసులు నమోదు కావడం జరిగిందని, ఎంతవరకు మహిళలకు న్యాయం చేశారో?? చెప్పాలని డిమాండ్ చేశారు.2024 లో ప్రజలు వైఎస్సార్సీపీని ఎక్కడ పెడతారో? తెలుసుకోండి తెలిపారు. సినిమా డైలాగులు మానుకోవాలని హితవు పలికారు. పైసాచికంగా మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ సొంత నిధులతో పార్టీలు నడపడం తప్ప?, కౌలు రైతులను ఆదుకొంటూ ఆర్థిక సహాయాన్ని అందించడం తప్ప? అని వారు ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.