Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఉరవకొండలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల నిరసన

విశాలాంధ్ర- ఉరవకొండ : చిత్తూరు జిల్లా పుంగునూరు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసుల పైన వైసిపి కార్యకర్తల పైన దాడులు చేయడం హేమమైన చర్యని ఈ సంఘటనను ఖండిస్తూ శనివారం ఉరవకొండలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు అల్లర్లు గొడవలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఆరోపించారు. పుంగునూరులో పోలీసులు పైన వైసిపి నాయకుల పైన దాడులు చేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా చర్చించాలన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img