విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం లోని గోరంట్ల మండలం నందు సోమవారం యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 52వ రోజు జరుగుతున్నందున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆమె భర్త వెంకటేశ్వరరావు యువ గళం పాదయాత్ర విజయవంతం కావడానికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోని కార్యకర్తలను నాయకులను భారీ జన సమీకరణ చేశారు అలాగే వచ్చిన ప్రజలందరికీ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని వాటర్ బాటిల్స్ భోజన ఏర్పాట్లు చేశారు యువ గళం పాదయాత్రకు విచ్చేసిన వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అనేక గ్రామాలకు కార్యకర్తలను తరలించడానికి సొంత నిధులతో వాహనాలు ఏర్పాట్లు చేయడం జరిగినది.