Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్న జాబిలి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణానికి చెందిన జాబిలి చాంద్ భాషాకు హైదరాబాద్ ,సుదరయ్యవిజ్ఞాన కేంద్రం వేదికగా సైమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా జరిగిన ఈ పురస్కార సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మూర్తీదేవీ పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్ ,తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు నాళేశ్వరం శంకర్ .ఇంకమ్ టాక్స్ ఛీఫ్ కమీషనర్ నరసింహప్ప చేతుల మీదుగా కొలకలూరి జాతీయ కవితాపురస్కారాన్ని జాబిలికి అందజేసారు.జాబిలి చాంద్ బాషా రాయలసీమలోని రైతుల దీనస్థితుల గురుంచి ,సీమఅస్థిత్వ నేపథ్యంతో చాలా గొప్పగా రాసిన కవితా సంపుటి మట్టిని ముద్దాడిన మనిషికి నాపేరు మీద పురస్కారాన్ని అందజేయటం నాకు చాలా గర్వంగా ఉంది అని కొలకలూరి ఇనాక్ అన్నారు.మట్టిని ముద్దాడిన మనిషి కవితా సంపుటి ఇది వరకే గిడుగు రామమూర్తి పంతుల స్మారక పురస్కారం,రాజా వాసిరెడ్డి కీర్తి పురస్కారాలు దక్కాయని.
రాయలసీమనుండి ఈ మధ్యకాలంలో వెలువడిన ఉత్తమ పుస్తకం ఇది అని
ఆసంస్థ కార్యదర్శి బిక్కి కృష్ణ అన్నారు..జాబిలి చాంద్ బాషా ఉపాధ్యాయుడిగా,కవిగా.రచయితగా సాహిత్య పత్రికా సంపాదకులుగా,సామాజిక కార్యకర్తగా మెరుగైన సమాజంకోసం పాటుపడుతున్నారు.దేశభక్తి,మతసామరస్యం,పర్యావరణ పరిరక్షణ ఈ మూడు విషయాలను కేంద్రంగా చేసుకొని ,విధ్యార్థులు.యువతీ యువకులకు అనేక అవగహనకార్యక్రమాలు నిర్వహించాడు జాబిలి,ఈ సందర్భంగా పెనుకొండ దర్గాపీఠాధిపతి తాజ్ బాబా,షిరిడీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ శిల్పమేడమ్,ఓంశాంతి విశ్వవిధ్యాలయ పెనుకొండ ఇన్చార్జ్ డా హేమలత సిస్టర్,ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి తదితరులు జాబిలికి శుభాకాంక్షలు తెలయజేసారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img