Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జడ్పీ చైర్మన్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధ్యర్యంలో మంగళవారం అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ దాకా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ ,నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు. కోగటం విజయభాస్కర్ రెడ్డి , సాహిత్య వాసంతి , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్, మహిళా శిశు శాఖ పి డి , శ్రీదేవి మునిసిపల్ హెల్త్ అధికారి గంగాధర్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డ్ర్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. .అనంతరం భారీ ర్యాలీ గా సప్తగిరి సర్కిల్ వరకు కొన సాగింది. ర్యాలీ అమాంతం ర్యాలీ లో పాల్గొన్న వైద్య సిబ్బంది ,ఆశలు ,వివిధ నర్సింగ్ కాలేజీ ల విద్యార్థినీ విద్యార్థులు పలు నినాదాలు చేసారు .1)జనాభా పెరుగుదల దేశ ప్రగతి అవరోధం అని ,2)చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని ,3)జనాభా నియంత్రణతో పేదరికాన్ని నిర్మూలిద్దామని, 4)సంతోషం మరియు శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పాటిద్దాం అని ,5)సరయిన వయస్సు లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని , 6)పెళ్ళైన సంవత్సరం తరువాతే పిల్లలు గూర్చి ఆలోచించాలని ,అనే క నినాదాలు చేశారు . అలాగే సప్తగిరి సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి జనాభా నియంత్రణ కొరకు భారత పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొంటామని ఁప్రతిజ్ఞఁ చేయడం జరిగింది . ఈ సందర్భంగా వైద్యశాఖ కార్యాలయం లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ… జనాభా పెరుగుదల నియంత్రణను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల చేత కుటుంబ నియంత్రణను పాటించే విధంగా పనిచేయాలని, ముఖ్యంగా తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతుల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
అనంతరం వైద్యారోగ్య శాఖలో కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో పురోగతి సాధించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు , నగదు. బహుమతి అందజేయడం జరిగింది. జిల్లాలో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన వారి నుండి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి కూడా నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ చెన్నకేశవులు, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ మనోజ్, డాక్టర్ మహేంద్ర నాథ్, మాస్ మీడియా అధికారి ఉమాపతి, ఉప మాస్ మీడియా అధికారులు త్యాగరాజు, గంగాధర్, హెల్త్ ఎడ్యుకేటర్స్ వేణు, వెంకటేశులు, కిరణ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img