రాష్ట్రంలో వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై సీఎం జగన్ స్పష్టంగా ప్రకటించారని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం జగన్ పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు.రాష్ట్ర విభజన తరువాత ప్రజల మనోభావాలు ఏంటి అనేది కూడా సీఎం చెప్పారన్నారు. ఎక్కడో ఒక దగ్గర అపోహలు ఉన్నాయని, టీడీపీ దుష్ప్రచారాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్లీ ముందుకు వస్తామన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి మళ్లీ వేగంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.