London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 14, 2024
Monday, October 14, 2024

అక్రెడిటేషన్ నిబంధనలు సరళీకరించాలి – ఏ.పి.యు.డబ్ల్యూ.జే.

ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా…
కమీషనర్ విజయకుమార్ రెడ్డి!

విజయవాడ – క్రెడిటేషన్ నిబంధనలను సరళతరం చేయాలన్న డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి హామీఇచ్చారు.నిబంధనలను సరళతరం చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలని కోరుతూ సోమవారం వినతిపత్రం అందజేసిన ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర ప్రతినిధి బృందానికి కమీషనర్ టి విజయకుమార్ రెడ్డి ఆమేరకు హామీ ఇచ్చారు.అక్రెడిటేషన్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం కమీషనర్ విజయకుమార్ రెడ్డి ని కలిసింది.కమీషనర్ ను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు , ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ , జాతీయ కార్యవర్గ సభ్యుడు డా. ప్రసాద్ , ఏ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏచూరి శివ , ఏ.పి. ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు , ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.జయరాజ్ , డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బి.అక్కులప్ప , కార్యదర్శులు ఏ.జయప్రకాష్ , మండేల శ్రీరామమూర్తి , పి. రామసుబ్బారెడ్డి , కోశాధికారి ఏ.వి. శ్రీనివాసరావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి , యూనియన్ సీనియర్ నాయకులు షేక్ బాబు , దారం వెంకటేశ్వరరావు , డి. నాగరాజు , జి.రామారావు తదితరులు ఉన్నారు.75000 – 3లక్షల మధ్య సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు అన్ని మండల కేంద్రాల్లో అక్రెడిటేషన్ ఇవ్వాలని, కొత్తజిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లా కేంద్రాల్లో , వార్తా కేంద్రాల్లో ఒక్కొక్క యూనిట్ కు అదనంగా అక్రెడిటేషన్ ఇవ్వాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
చిన్నపత్రికలకు అక్రెడిటేషన్ సంఖ్యను పెంచాలని, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికపై బస్సు పాస్ లు ఇవ్వాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.ఆమేరకు వినతిపత్రాన్ని కమీషనర్ కు అందచేసారు.
దానికి స్పందించిన కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రెడిటేషన్ ఇచ్చేందుకు వీలుగా ఇప్పటికే కొన్ని నిబంధనలను సరళతరం చేశామని అన్నారు.
నిబంధనలు ఇంకా సరళతరం చేయాలన్న యూనియన్ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చర్చలలో పాల్గొన్న వారిలో జాయింట్ డెరైక్టర్లు కస్తూరి , కిరణ్ కుమార్, స్వర్ణలత తదితరులు ఉన్నారు.తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నామని , లేనిపక్షంలో ఉద్యమించాల్సి ఉంటుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు , చందు జనార్ధన్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
అంతకుముందు ఏ.పి.యు.డబ్ల్యూ .జే రాష్ట్ర ఆఫీస్ బెరర్ల సమావేశం ఐ.వి. సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. జీవో 38 లోని నిబంధనలను యధాతథంగా అమలు చేస్తే అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లభించే అవకాశం పోతుందని యూనియన్ నాయకుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img