అనంతపురం జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బళ్లారి నుంచి ఇన్నోవా వాహనంలో వస్తున్న సమయంలో కారును కంటైనర్ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.