Monday, February 6, 2023
Monday, February 6, 2023

అనని మాటలను అపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియ

మంత్రి పేర్ని నాని

చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదని, ఆమెను ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్‌ రికార్డును బయట పెట్టాలని మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు.ఆమె పేరును శాసనసభలో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు చిత్రీకరణ చేస్తున్నారని అన్నారు. . రాజకీయాలను రాజకీయలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని వ్యాఖ్యానించారు. అంత సంస్కారం లేకుండా ఎవరూ మాట్లాడరని అన్నారు. అసెంబ్లీలో ఫోన్లతో రికార్డు చేయకూడదని… కానీ టీడీపీ సభ్యులు రికార్డు చేసిన వీడియోను అందరికి పంపారన్నారు. అనని మాటలను ఇద్దరు శాసన సభ్యులకు అపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియ అని అన్నారు.బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్‌ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img