Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

అప్పులు, అక్రమ కేసులతో రాష్ట్ర పరువు రోడ్డు పాలు : యనమల

మూడేళ్ల మద్యం అమ్మకాలు, ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. అప్పులు, వడ్డీలు, తాకట్టుల వివరాలు బయట పెట్టాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సారా మరణాలన్నీ జే-గ్యాంగ్‌ మద్యం మాఫియా హత్యలే అని ఆరోపించారు.డిస్టిలరీలు, బ్రాండ్లు, టెండర్లు లేకుండా కొనుగోళ్లకు కారణాలు వెల్లడిరచాలని ఆయన అన్నారు. ఆవ గింజలంటే.. తాటికాయల్లా ఉంటాయన్నట్లు పెగాసెస్‌పై జే – గ్యాంగ్‌ తీరు ఉందని వ్యాఖ్యానించారు. పెగాసెస్‌ అనేది ఏంటో తెలియని వేలిముద్రగాళ్లు కూడా పెగాసెస్‌ పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతిలో అవినీతి, కోడికత్తి, బాబాయి గొడ్డలివేటు జాబితాలో.. నేడు పెగాసెస్‌ అని తెలిపారు. అప్పులు, అక్రమ కేసులతో రాష్ట్ర పరువు రోడ్డు పాలు అవుతోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img