Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అభివృద్ధిపై ప్రశ్నించడమే ఆ దళిత యువకుడు చేసిన తప్పా?: చంద్రబాబు

బాధితుడికి న్యాయం జరిగేదాకా పోరాడతామని వెల్లడి
వైసీపీ హయాంలో అభివృద్ధిపై ప్రశ్నించిన ఓ దళిత యువకుడిపై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీ అనుచరులు దాడి చేసిన ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అణగారిన వర్గాల నుంచి రావడమే తప్పన్నట్లుగా జగన్‌ సర్కారు వ్యవహరిస్తోందని సదరు ట్వీట్‌లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దళిత యువకుడిని కొడుతున్న వీడియోను కూడా చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. తన గ్రామంలో అభివృద్ధి జరగని వైనాన్ని ఆ దళిత యువకుడు ప్రశ్నించాడని, అదే తప్పన్నట్లుగా అతడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ జమానాలో ప్రశ్నించడమే తప్పన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అణగారిన వర్గాల హక్కులను హరించడమే వైసీపీ సర్కారు పద్దతిగా మారిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణుల చేతుల్లో దాడికి గురైన బాధితుడికి, అతడి కుటుంబానికి న్యాయం జరిగే దాకా టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకునే దాకా తాము పోరాటం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img