Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

అమరావతి రైతులకు భారీగా మద్దతు..

అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొంటున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. కొవ్వలి మహిళలు భారీగా పాల్గొన్నారు. వైసీపీ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పాదయాత్ర చేస్తున్న మహిళలంటే అంత చులకనా అంటూ మండిపడ్డారు. వారు భూములు త్యాగం చేసి, పాదయాత్ర చేస్తున్నది వారి కోసం కాదన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలనే లక్ష్యంతోనూ భావితరాల కోసం చేస్తున్నారని మహిళలు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img