Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా?

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు
దయచేసి దొంగలకు ఓటెయ్యొద్దని, ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కోరారు. జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున అంబేద్కర్‌ విగ్రహం నుంచి టీడీపీ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో ఆయన మీడియ మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. విజయ్‌ సాయిరెడ్డి, విశాఖను దోచుకొని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు పాలుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img