గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు. ఇంతే కాకుండా 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు.